Mark Carney | కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని (Canada PM) మార్క్ కార్నీ (Mark Carney) నేతృత్వంలోని లిబరల్ పార్టీకే ఆధిక్యం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోతున్నారు (Victory Celebration). ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. రాప్-రాక్ బ్యాండ్ డౌన్ విత్ వెబ్‌స్టర్ (DWW)లో నిర్వహించిన విక్టరీ ఈవెంట్లో.. డీడబ్ల్యూడబ్ల్యూ హుడీ ధరించి ‘టైమ్ టు విన్’ పాటకు డ్యాన్స్ చేశారు. తన స్టెప్పులతో అక్కడ ఉన్నవారందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కెనడా పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో 343 సీట్లుండగా అధికారం చేపట్టాలంటే 172 సీట్లు రావాలి. ఓట్ల లెక్కింపు నిలిపివేసే నాటికి అధికార లిబరల్స్ 168 సీట్లలో గెలుపు/ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి మెజారిటీకి వారు ఇంకా నాలుగు సీట్ల దూరంలో ఉన్నారు. 144 సీట్లతో కన్జర్వేటివ్ పార్టీ వారిని అనుసరించింది. ఖలిస్థాన్ అనుకూలుడైన జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రాటిక్ పార్టీ కేవలం 4-7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేశారు. కార్నీ పార్టీ గెలవడం, జగ్మీత్ సింగ్ ఓడటం భారత్‌కు శుభవార్తేనని చెప్చవచ్చు. ఎందుకంటే ఇటీవల దెబ్బతిన్న రెండు దేశాల దౌత్య సంబంధాలు ఈ ఎన్నికల ఫలితాల అనంతరం పునరుద్ధరణకు అవకాశాలు ఉన్నాయి.
Canada’s new leader.
— Oli London (@OliLondonTV) April 29, 2025
Also Read..
కెనడా ఎన్నికల్లో లిబరల్స్‌కే పట్టం.. మళ్లీ ప్రధానిగా కార్నీ
Canada PM | ట్రంప్ బెదిరింపులకు భయపడొద్దు.. మనం ఐక్యంగా ఉండాలి : మార్క్ కార్నీ
Canada Elections | కెనడాలో అధికార లిబరల్ పార్టీకే పట్టం.. ప్రధాని పీఠం మళ్లీ మార్క్ కార్నీకే