Canada Elections | కెనడాలో అధికార లిబరల్ పార్టీకే పట్టం.. ప్రధాని పీఠం మళ్లీ మార్క్ కార్నీకే
Canada Elections | కెనడా సార్వత్రిక ఎన్నికల్లో (Canada Elections) అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. వరుసగా నాలుగోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. దాంతో కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) నే మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు.
Canada Elections : కెనడా సార్వత్రిక ఎన్నికల్లో (Canada Elections) అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. వరుసగా నాలుగోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. దాంతో కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) నే మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకి 167 స్థానాలు దక్కాయి. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కేవలం 145 స్థానాలకే పరిమితమైంది. దాంతో లిబరల్ పార్టీకి అధికారం ఖాయమైంది. కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు.
కెనడా పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 172 మంది సభ్యుల బలం అవసరం. అయితే లిబరల్ పార్టీకి 167 స్థానాలు మాత్రమే వచ్చాయి. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్ల కంటే ఐదు సీట్లు తక్కువయ్యాయి. లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాంతో మార్క్ కార్నీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ ఎన్నికల్లో ఫ్రాంకోయిస్ బ్లాంకెట్ నేతృత్వంలోని బ్లాక్ క్యూబికాయిస్ పార్టీ 23 స్థానాల్లో గెలిచింది. ఇక ఖలిస్థానీలకు అనుకూలుడైన జగ్మీత్ సింగ్‌కు చెందిన ఎన్డీపీ (NDP) ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలిచింది. పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ జగ్మీత్ సింగ్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
అమెరికాతో సుంకాల యుద్ధానికి తోడు, కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలంటూ ట్రంప్ బెదిరిస్తున్న వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్‌తోనూ కెనడాకు దౌత్య విభేదాలు కొనసాగుతున్నాయి. దాంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీని ఎన్నుకున్నారు.
నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కార్నీ వెంటనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దాంతో ఎన్నికల క్రతువు అంతా పూర్తయ్యి ఏప్రిల్ 28న పోలింగ్ జరిగింది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

