BRS Party | తొగుట, అక్టోబర్ 09 : ఉద్యమాల గడ్డ తొగుట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా రెపరెప లాడించడానికి బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు రాంపూర్ లోని ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొగుట మండలంలో గత రెండు పర్యాయాలు జడ్పీటీసీతోపాటు మండల పరిషత్ పీఠంను బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోవడం జరిగిందన్నారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతోపాటు 420 హామీలను తుంగలో తొక్కి ప్రజలను దోచేసిందని ఆయన విమర్శించారు. ఓటేసిన పాపానికి యూరియా కొరతతో రైతులను అరిగోస పెట్టిందని ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తు చిత్తుగా ఓడించి కసి తీర్చుకోవాలన్నారు.
2500 ఫించన్, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం, ఫించన్ పెంపు ఏమైందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ పాలన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని, నేడు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండమవుతుందని, సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
ఖరుడు కట్టిన కార్యకర్తల మూలంగానే అధికారంలో లేకున్నా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, ఎడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉందని, పదుల సంఖ్యలో పోటీపడుతున్నారన్నారు. పోటీలో ఉండే అభ్యర్థుల వివరాలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఖరారు చేయడం జరుగుతుందన్నారు.
జప్తిలింగారెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానం నుండి బీఆర్ఎస్ పార్టీ పక్షాన లింగాపూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు తగరం అశోక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్లు కె హరికృష్ణారెడ్డి, కుర్మ యాదగిరి, నాయకులు బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, చిలువేరి మల్లారెడ్డి, బోధనం కనకయ్య, దోమల కొమురయ్య, బక్క కనకయ్యలతో పాటు మండలంలోని మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Local Body Elections | స్థానిక ఎన్నికల నామినేషన్లు షురూ.. కీలక ప్రకటన చేసిన ఎస్ఈసీ
KCR | బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు పితృ వియోగం.. సంతాపం తెలిపిన కేసీఆర్