Sridhar Rao | మాజీ కార్టూనిస్ట్కు కేబినెట్ ర్యాంక్ హోదా.. ప్రభుత్వ సలహాదారుగా కీలక బాధ్యతలు..!
Sridhar Rao : తెలుగు పాఠకులకు సుపరిచితులైన మాజీ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావు(Sridhar Rao)ను ఉన్నత పదవి వరించింది. తన కళా నైపుణ్యంతో విశేష గుర్తింపు పొందిన ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ హోదాతో గౌరవించింది
Sridhar Rao : తెలుగు పాఠకులకు సుపరిచితులైన మాజీ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావు (Sridhar Rao)ను ఉన్నత పదవి వరించింది. తన కళా నైపుణ్యంతో విశేష గుర్తింపు పొందిన ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ హోదాతో గౌరవించింది. శ్రీధర్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. సమాచార ప్రచార విభాగానికి సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా ఆయన వ్యహరించనున్నారు. ప్రభుత్వ సలహాదారుగా శ్రీధర్ను నియమిస్తూ శుక్రవారం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామల రావు (Shyamala Rao) ఉత్తర్వులు జారీ చేశారు.
సుదీర్ఘకాలం ‘ఈనాడు’ దిన పత్రికలో త న మార్క్ కార్టూన్లతో తెలుగు లోగిళ్లకు చేరువైన పోచంపల్లి శ్రీధర్.. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఆయన సేవలందించనున్నారు. కేబినెట్ ర్యాంక్ హోదాలో శ్రీధర్ రెండేళ్ల పాటు కొనసాగుతారని ఉత్వర్వుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామల రావు పేర్కొన్నారు. కేబినెట్ ర్యాంక్ హోదా కావడంతో ఆయనకు జీతభత్యాలు, అలవెన్సులు కూడా అదే స్థాయిలో వర్తిస్తాయని శ్యామల రావు వెల్లడించారు.
ఈనాడు మాజీ ఉద్యోగికి ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి
ఈనాడు మాజీ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావుని సమాచార ప్రచార విభాగానికి సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా నియమించిన ఏపీ ప్రభుత్వం
కేబినెట్ ర్యాంక్ హోదాలో రెండేళ్ల పాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామల రావు pic.twitter.com/fVPcMbPHl4
— Telugu Scribe (@TeluguScribe) February 20, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

