KCR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ తండ్రి ఎర్రోళ్ల విజ్జయ్య మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పితృ వియోగంతో శోకతప్తులైన ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎర్రోళ్ల విజ్జయ్య (75) గురువారం ఉదయం మరణించారు. ఆయన మృతిపట్ల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో వారికి మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు.