Sports | రాయపోల్, ఆగస్టు 21 : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలస్థాయి 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కో ఆర్డినేషన్ సమావేశం గురువారం దౌల్తాబాద్‌లో ఏర్పాటు చేశారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ మండల విద్యాధికారి , ఫిజికల్ డైరెక్టర్ విష్ణు ఆధ్వర్యంలో మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహణ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ గజ్జల కనకరాజు మాట్లాడుతూ.. ఈ గేమ్స్ విజయవంతంగా నిర్వహించాలని.. విద్యార్థులకు మంచి ప్రోత్సాహాన్ని అందించాలని అన్నారు. ఆగస్టు 25,26, 28 తేదీల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఆటలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంజేపీ గురుకుల పాఠశాల
లింగరాజ్ పల్లి, బాలుర ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌కు వేదిక అన్నారు. ఈ క్రీడోత్సవాల్లో అండర్ -14,అండర్ -17 బాలబాలికలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంజేపీ గురుకుల పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సాయి కృష్ణ, ఉపాధ్యాయులు సురేష్, రవీందర్, మోహన్, అరుణ్, అనిత, ప్రత్యూష, చంద్రం పాల్గొన్నారు.
Mancherial | 108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం
MLA Gaddam Vinod | మద్యం మత్తులో జాతీయ రహదారిపై ఎమ్మెల్యే వినోద్ అనుచరులు, పీఏల హల్చల్.. వీడియో
Malayalam Actress | హోటల్‌కి రమ్మన్నాడు.. యువ రాజకీయ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు