CM Relief Fund | కొమురవెల్లి, ఏప్రిల్ 10 : కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన కానుగల లక్ష్మి అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందగా.. బాధితురాలికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైంది. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును రూ.13,500 ఇవాళ బాధిత కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నాయకుడు ఏర్పుల మహేశ్ అందజేశారు.
ఈ సందర్భంగా చెక్కు మంజూరు కోసం సహకారాలు అందించిన మాజీ మంత్రి హరీశ్‌రావుకు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సార్ల కిష్టయ్య, గొల్లపల్లి కిష్టయ్య, మల్లన్న ఆలయ మాజీ ధర్మకర్త ముత్యం నర్సింహులుగౌడ్, గొల్లపల్లి ఆంజనేయులు, కనకయ్య తదితరులు ఉన్నారు.