పెద్దపల్లి: పెద్దపల్లి (Peddapalli) జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మూడేండ్ల కూతురిని చంపిన ఓ మహిళ, అనంతరం తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని జూలపల్లి మండలం కేంద్రానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. నాలుగేండ్ల క్రితం కరీంనగర్ జిల్లా వెధిర గ్రామానికి చెందిన సాహితీతో వివాహం జరిగింది. వారికి మూడేండ్ల కూతురు ఉన్నది. ప్రస్తుతం పెద్దపల్లి పట్టణంలోని టీచర్స్ కాలనీలో వేణుగోపాల్ రెడ్డి, లోక సాహితి రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం వేణుగోపాల్ జగిత్యాలలోని తమ సమీప బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. దీంతో రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో సాహితి తన కూతురు రితన్యకు ఉరివేసి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, సాహితి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే గత కొంతకాలంగా ఆమె మానసిక బాగాలేనట్లు తెలుస్తున్నది.