CITU | సిద్ధిపేట జిల్లా తొగుట మండలకేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల మండల స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం సీఐటీయూ సిద్దిపేట జిల్లా 4వ మహాసభలు 2025 నవంబర్ 9,10 తేదీల్లో సిద్దిపేటలో నిర్వహించే మహాసభలను జయప్రదం చేయాలనీ కోరుతూ కరపత్రం విడుదల చేశారు.
ఈ సందర్భంగా CITU జిల్లా కోశాధికారి జి.భాస్కర్ మాట్లాడుతూ.. సీఐటీయూ అనునిత్యం కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ దేశంలోని అగ్రగామి కార్మిక సంఘంగా నిలుస్తుందని అన్నారు. సీఐటీయూ ఐక్యత, పోరాటం అనే నినాదంతో ఆవిర్భవించిందనీ,అవిర్భావం నుండి పాలకులు తెచ్చే కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుతుందనీ తెలిపారు.
NDA ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేసిందనీ, అధికారంలోకి వచ్చి కార్మిక,ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తూ బీజేపీ మోడి ప్రభుత్వం పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తుందనీ విమర్శించారు. విదేశీ టూర్లు తప్ప కార్మికుల, ఉద్యోగుల, ప్రజల బాధలు పట్టడం లేదనీ, కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చి 4 లేబర్ కోడ్లు తెచ్చిందనీ ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలు చేస్తుందన్నారు.
కార్మిక చట్టాల రక్షణ కోసం సీఐటీయూ అందరిని ఐక్యం చేసి దేశవ్యాప్త సమ్మెలు నిర్వహిస్తుందని, కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి దేశ ప్రజలను మోసం చేస్తుందన్నారు. స్కీమ్ వర్కర్లకు బడ్జెట్లో నిధులు తగ్గించడం దుర్మార్గం అన్నారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ. 26 వేలు అమలు చేయాలని పోరాడుతుంటే రోజుకు రూ. 178/- ఉండాలని నిర్ణయించిందని మండిపడ్డారు.
ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు లేదు..
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోగా, పని గంటలు పెంచుతూ జి.ఓ. 282ను తీసుకవచ్చిందనీ, కనీస వేతనాల జీ.ఓ.లను సవరించ లేదనీ, స్కీం వర్కర్ల, అంగన్వాడి, ఆశా, మధ్యాహ్న భోజనం, మెప్మా పట్టణ RP, IKP VOA, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు, పని భారం విపరీతంగా పెరిగాయనీ,అసంఘటిత రంగం హమాలి, భవన నిర్మాణ, ట్రాన్స్పోర్టు తదితర కార్మికులకు సాంఘీక భద్రత లేదన్నారు. ఇచ్చిన హామీల అమలుకై పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉన్నదనీ అన్నారు.
ఈ నేపథ్యంలో సీఐటీయూ జిల్లా 4వ మహాసభలు జిల్లా కేంద్రమైన సిద్దిపేట పట్టణంలో 2025 నవంబర్ 9,10 తేదీలలో నిర్వహిస్తున్నామనీ,రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారనీ తెలిపారు. ఈ మహాసభల జయప్రదానికి మిత్రులు, శ్రేయోభిలాషులు, వాపార సంస్థలు, మేధావులు, అధికారులు, కార్మికులందరూ విరివిగా ఆర్థిక, హార్థిక సహాయ సహాకారాలు అందించి సహాకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ తొగుట మండల కన్వీనర్ ఏ .వసంత, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తోగుట మండల అధ్యక్షుడు నర్సింలు, కార్యదర్శి మాణిక్యం, కార్మికులు రాములు, యాదగిరి ,పోచయ్య ,నరసయ్య, మల్లయ్య, శ్యామల ,ఏసు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Bihar Election | అభ్యర్థులను ఖరారు చేసిన జేడీయూ.. నాలుగు స్థానాలలో సిట్టింగ్లకు ఉద్వాసన..!
Explosives In Bag | వదిలేసిన బ్యాగులో పేలుడు పదార్థాలు.. బాంబ్బ్లాస్ట్కు కుట్రగా అనుమానం
Narnoor | మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు : ఎస్ఐ అఖిల్