Panchayati Labourers | గజ్వేల్, ఏప్రిల్ 7: మల్లన్నసాగర్ ముంపు గ్రామాల పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ ఇవాళ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందనబోయిన ఎల్లయ్య వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముంపు గ్రామాల పంచాయతీ కార్మికుల ఖాతాలను మూసివేయడంతో గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. పంచాయతీ కార్మికులు అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. కార్మికుల ఖాతాలను వెంటనే రీఓపెన్ చేసి గత నాలుగు నెలలుగా బకాయిపడ్డ వేతనాలు జమ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ము స్వామి పాల్గొన్నారు.