మేడ్చల్: ఎంఎంటీఎస్ రైల్లో మహిళపై అత్యాచారయత్నం ఘటన మరువకముందే.. మరో యువతిపై అఘాయిత్యానికి యత్నించారు దుండగులు. ఆదివారం రాత్రి మేడ్చల్ (Medchal) రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువతి ఒంటరిగా వెళ్తున్నది. ఆమెను అడ్డుకున్న దుండగులు.. లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిఘటించిన యువతి.. కామాంధుల నుంచి తనను తానుకాపాడుకునేందుకు అక్కడే ఉన్న రాళ్లతో వారిపై దాడిచేసి అక్కడి నుంచి తప్పించుకున్నది. మేడ్చల్ పోలీస్టేషన్‌కు చేరుకుని తనకు జరిగిన దాడిని గురించి వారికి వివరించింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. అయితే ఘటన రైల్వే స్టేషన్ పరిధిలో జరగడంతో రైల్వే పోలీసులకు బదిలీ చేశారు.