Libraries | రాయపోల్, డిసెంబర్ 01 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వడ్డేపల్లి, ఎలుకల్ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాలను రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి సోమవారం ప్రారంభించారు. రూమ్ టు రీడ్ సంస్థ–సమగ్ర శిక్ష వారి సహకారంతో ఈ గ్రంథాలయాల ఏర్పాట్లు జరిగాయి. 80 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉండే పాఠశాలలు, ఫస్ట్ క్లాస్లో 15 మంది పిల్లల కన్నా ఎక్కువ ఉన్న పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారని అధికారులు తెలిపారు.
ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేసి, చదివే ఆసక్తిని పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రంథాలయాల కోఆర్డినేటర్ భవాని మాట్లాడుతూ.. పిల్లల్లో పఠన శక్తి పెంపొందినప్పుడు వారు భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా ఎదగడానికి ఇది చక్కని అవకాశం. సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పిల్లలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, నాగభూషణం, ఉపాధ్యాయులు నరేష్, సాజిద్, స్వప్న, నరసింహ, నరేష్, కరుణాకర్, ఆండాలు, తల్లిదండ్రులు, సీఆర్పీలు పాల్గొన్నారు.
Padipuja | అయ్యప్ప స్వామి పడిపూజలో మాజీ ఎమ్మెల్యే
Local Election | విద్యుత్ నో డ్యూ సర్టిఫికెట్ కోసం ఎన్నికల అభ్యర్థుల తిప్పలు
Bomb Threat | కేరళ సీఎంకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు