CC Cameras | రాయపోల్, సెప్టెంబర్ 02 : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుతాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ అనురాధ అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు వ్యాపారస్తులు ముందుకు రావడం పట్ల వ్యాపారస్తులను సీపీ అభినందించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.. దౌల్తాబాద్ మండల కేంద్రంలో ముఖ్యమైన చౌరస్తాలలో ఎంట్రీ, ఎగ్జిట్ 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర వహిస్తాయి.
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు. నేరరహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని.. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం, ప్రజలకు భద్రత, సెన్సాఫ్ ఆఫ్ సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. నేరాలను నియంత్రించడంలో నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని, సీసీ కెమెరాలు 24 గంటల నిరంతరం పని చేస్తాయని తెలిపారు.
ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే..
జిల్లాలో నేరాలను అదుపు చేయడానికి పోలీసులతోపాటు వివిధ సంఘాల ప్రతినిధులు భాగస్వామ్యం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీసీ కెమెరాలు ఉన్న ఇండ్లలో, కాలనీలలో, గ్రామాలలో, నేరస్తులు నేరం చేయడానికి భయపడతారని తెలిపారు. ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉన్నందున ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని.. అందుకు గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సూచించారు.
సిద్దిపేట జిల్లాలో సీసీ కెమెరాలు ఉండి పని చేయని సీసీ కెమెరాల విషయంలో నూతన సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. ప్రజలు కూడా ఇంటి ఆవరణలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే డయల్ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జియోట్యాగింగ్ ద్వారా సిద్దిపేట కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసి తర్వాత హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా షాపుల యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఒక కెమెరా రోడ్డువైపు పెట్టుకోవాలని సూచించారు.
గంజాయి ఇతర మత్తుపదార్థాలపై పటిష్ట నిఘా..
వ్యాపారస్తులు ఎన్నో లక్షల డబ్బులు ఖర్చు పెట్టి షాపులు పెడతారు. రూ. 20 వేల నుండి 30 వేల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగినా దొంగతనం జరిగినా నేరస్తులను పట్టుకోవడం సులభతరం అవుతుందన్నారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో యువకులు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. గంజాయి ఇతర మత్తుపదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
దౌల్తాబాద్ బస్టాండును ఎస్ఐ అరుణ్ చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను తీసివేసి, బస్టాండ్ ఆవరణంలో ఎత్తు పల్లాలు లేకుండా మొరం పోయించాడు. మరుగుదొడ్లు, లైటింగ్ బస్టాండ్ పరిశుభ్రంగా చేయించడం వల్ల ఇప్పుడు బస్సులు వచ్చి పోతున్నాయి. బస్టాండ్‌ను సందర్శించిన పోలీస్ కమిషనర్ ఎస్ఐని అభినందించారు. గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలతో కాసేపు సరదాగా గడిపి వారికి అందిస్తున్న ఫుడ్ మెనూ అడిగి తెలుసుకున్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించారు. ఆనందోత్సవాల మధ్య వినాయక నిమజ్జనం కార్యక్రమం నిర్వహించుకోవాలని యూత్ సభ్యులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నరసింహులు, తొగుట సీఐ లతీఫ్, దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్, తొగుట ఎస్ఐ రవికాంత్ రావు, మాజీ సర్పంచ్ వేణుగోపాల్, దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఉన్న వ్యాపారస్తులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు విద్యార్థినీ విద్యార్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
BRS leaders | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం : బీఆర్ఎస్ నాయకులు
Heavy rains | తిమ్మాపూర్ మండలంలో భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం
Uttarakhand | ఉత్తరాఖండ్‌కు రెడ్ అలర్ట్.. 10 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత