తిమ్మాపూర్,ఆగస్టు28 : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బుధవారం గురువారం భారీ వర్షాలు కురిసాయి. ఈ నేపథ్యంలో కుంటలు, చెరువులన్నీ నిండి పొంగిపొర్లాయి. గొల్లపల్లి గ్రామంలో బొమ్మల కుంట చెరువు కట్ట సగం వరకు తెగిపోయింది. వరద దాటికి కింద ఉన్న 50 ఎకరాల వరి పంట నీట మునిగింది.
అలాగే ఇందిరానగర్ టు నుండి మన్నెంపెళ్లి వెళ్లేదారిలో రామకృష్ణ కాలనీ నుండి పోరండ్ల వెళ్లే దారి తెగిపోయింది. తిమ్మాపూర్ నుండి పోరండ్ల వెళ్లే దారి వరద ఉధృతి పెరిగి రాకపోకలకు అంతరాయం కలిగించింది. ఆయా చోట్ల తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, నాయకులు పరిశీలించారు. వర్షాలలో అప్రమత్తంగా ఉండాలని ఆపద వస్తే సమాచారం అందించాలని సూచించారు.