రామగిరి, మార్చి 04 : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ నూతన సభ్యులను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆధ్వర్యంలో సిలబస్ కూర్పు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం వంటి అంశాలను చర్చించి ఆమోదం చేయనున్నారు. బి ఓ ఎస్ సభ్యులుగా ఆచార్య అలువాల రవి, డా.జక్క సురేశ్ రెడ్డి, డా.శ్వేత, డా.వి.అనురాధ, మెంబర్ కన్వీనర్‌గా డా.లక్ష్మీప్రభ, ఎక్స్స్టర్నల్ సభ్యులుగా శ్రీవాస్తవ అపర్ణ, ఏదుళ్ల శ్రీధర్ రెడ్డిని నియమించారు. ఈ నియామకం రెండేళ్ల పాటు అమలులో ఉండి విభాగ పురోగతికి సేవలందించనున్నారు.