Irrigation Water | ములుగు, మార్చి 29 : రైతులపై అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేయడం అప్రజాస్వామికమని డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో కాలువ ద్వారా తమ పొలాలకు నీరందించాలని గత సంవత్సర కాలం నుండి రైతులు నీటిపారుదల శాఖ అధికారులకు విన్నవించినప్పటికి ఫలితం లేకపోవడంతో ఆరుగాలం పండించిన పంట ఎండిపోతుంటే కొంత మంది రైతులు కాలువకు గండిపెట్టి తమ పొలాలకు నీరందించారు. దీంతో 9 మంది రైతులపై నీటిపారుదలశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
దీన్ని ఖండిస్తూ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి ఇవాళమండల కేంద్రం ములుగులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎండిపోతుంటే చూడలేక రైతులు కాలువ ద్వారా నీరందిస్తే వారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. రైతు బంధు, రుణమాఫీ ఎగవేసి రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి రైతులపై కేసులు పెట్టి పాపాన్ని మూటకట్టుకుంటుందన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి రైతుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్న బేషరుతుగా కేసును ఎత్తివేసి సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకొని రైతుల పొలాలకు నీరందించాలని డిమాండ్ చేశారు. పంటపొలాలు ఎండిపోకుండా కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా చెరువులకు, కుంటలకు నీరందించాలని సూచించారు.
రైతుల పొలాలకు నీటిని విడుదల చేసి వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దుంబాల లింగారెడ్డి, మహంకాలి శ్రీనివాస్, సందీప్‌రెడ్డి, రాజిరెడ్డి, రైతులు ఉన్నారు.
Kathmandu | నేపాల్‌లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.