ACP Narsimhulu | గజ్వేల్, జూన్ 12 : ప్రతీ కేసును పారదర్శకంగా పరిశోధన చేయాలని ఏసీపీ కె నర్సింహులు సూచించారు. గురువారం ఏసీపీ కార్యాలయంలో డివిజన్ పోలీస్ అధికారులతో పెండింగ్లో ఉన్న కేసులపై ఏసీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నమోదైన కేసుల పరిశోధన ఏ స్థాయిలో ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆత్మహత్యల కేసులపై పారదర్శకంగా పరిశోధన చేసి అందుకు గల కారణాలను తెలుసుకొని నివారణ కోసం కౌన్సెలింగ్ చేయాలన్నారు. ప్రజలు చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఎలాంటి సమస్యలున్నా పోలీసులను సంప్రదించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్ స్పాట్లను గుర్తించాలన్నారు.
గంజాయి మత్తు పదార్థాలపై నిఘా ఉంచాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలన్నారు. పెండింగ్ కేసులపై దృష్టి సారించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. కేసుల ఛేదనలో టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీఐలు సైదా, ముత్యంరాజు, మహేందర్రెడ్డి, లతీఫ్, ఎస్ఐలున్నారు.
Ahmedabad plane crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nidamanoor : భూ భారతితో భూములకు భద్రత : వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం
Surekha Vani | సురేఖా వాణి చేసిన పనికి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్