నిడమనూరు, జూన్ 12 : భూ భారతి చట్టం అమలుతో భూములకు భద్రత లభిస్తుందని నల్లగొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. గురువారం మండలంలోని వెనిగండ్ల గ్రామంలో రెవెన్యూ సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ధరణి చట్టంలో నెలకొన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, రైతాంగానికి మేలు చేసేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తుందని, భూ యజమానులు సమస్యలపై ధరఖాస్తులు సమర్పించి పరిష్కరించుకోవాలన్నారు.
తాసీల్ధార్ జంగాల కృష్ణయ్య మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి అమలు చేస్తున్న భూ భారతితో రైతులకు మెరుగైన ప్రయోజనం చేకూరుతుందన్నారు. భూ సమస్యలపై ధరఖాస్తులు సమర్పించి పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం పలువురి నుంచి ధరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గిర్ధావర్లు సందీప్, దాడి రాజిరెడ్డి, మండల సర్వేయర్ విజయ్ కుమార్, నాయకులు పోలె డేవిడ్, ముంగి శివమారయ్య, కట్టెబోయిన గోవర్ధన్ యాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్ పోలె రవి, నాయకులు కట్టెబోయిన గురువయ్య యాదవ్, బొల్లం రవి యాదవ్, వట్టె మహేశ్ యాదవ్, పోలె ఇసాక్ పాల్గొన్నారు.