Surekha Vani | ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలతో సందడి చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి. విజయవాడలో పుట్టి పెరిగిన సురేఖవాణి 8వ తరగతి చదువుతున్నప్పుడు ఓ లోకల్ ఛానెల్లో యాంకర్‌గా చేసింది. అలానే ఇంటర్ వరకు నెట్టుకొచ్చిన ఆమె.. యాంకరింగ్‌లోనే స్థిరపడాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలోనే మీడియా రంగానికి చెందిన సురేష్ తేజని వివాహం చేసుకుంది. వృత్తిరీత్యా వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు సుప్రీత సంతానం. అయితే ఈ మధ్య సురేష్ తేజ అనారోగ్యంతో చనిపోయారు.
సురేష్ తేజ చనిపోయిన తర్వాత సురేఖా వాణి ఎక్కువగా కూతురితోనే సందడి చేస్తూ ఉంటుంది. పలు ప్రాంతాలు చుట్టేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఈ మధ్య సురేఖా వాణికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. దాంతో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది సురేఖా వాణి. ఇందులో ఈమె టాటూ వేయించుకుంటూ ఉండగా, పక్కనే ఉన్న కూతురు సుప్రిత కూడా చప్పట్లు కొడుతూ దర్శనమిచ్చింది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. “ఆ పెదబాబు అడుగుల వెనకే ఉన్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
అయితే ఆమె చేతి మీద గోవింద నామాల టాటూ, శ్రీవారి పాదాల టాటూ వేయించుకోవడంతో కొందరు జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది భక్తిలా అనిపించడం లేదు.. ఎందుకంత ఓవర్ యాక్షన్.. దేవుడితోనే ఆటలా? అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం టాటూ బాగుందని, నైస్ అని కామెంట్లు పెడుతున్నారు. శ్రీవారిపై పై సురేఖకు ఉన్న భక్తిని చూసి ఆమె ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇక సురేఖా వాణి చాలా రోజుల తర్వాత కన్నప్ప చిత్రంలో నటించింది. ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుండగా, ఈ మూవీతో తన ఫ్యాన్స్‌ని అలరించనుంది.