అమరావతి : గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై (Ahmedabad plane crash) ఆంధ్రప్రదేశ్‌కు ( Andhra Pradesh ) చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టునుంచి లండన్ వెళుతున్న బోయింగ్ 787 -8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలి పలువురు మరణించారు.
ఏపీ సీఎం చంద్రబాబు ( Chandra babu ) , డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ( Pawan Kalyan ) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విమాన ప్రమాదం గురించి తెలిసి బాధకు గురయ్యామని వారు పేర్కొన్నారు. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. విమాన ప్రమాద ఘటన తెలిసి షాక్‌కు గురయ్యానని వైసీపీ నేత, మాజీ సీఎం వైఎస్ జగన్( YS Jagan) అన్నారు.