BRS Party | రాయపోల్, జూలై 05 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ప్రజలకు ఏ ఒక్క విషయంలో కూడా మంచి చేయడం లేదని దౌల్తాబాద్ మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సరుగారి యాదవ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం కొనసాగించలేకపోతున్న పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోతుందని ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని గుర్తు చేశారు. రైతు భరోసా, మహాలక్ష్మి పథకం, రాజీవ్ యువ వికాస్, కళ్యాణ లక్ష్మి పథకం.. తులం బంగారం ఇస్తామని ప్రజలకు మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోసం చేసిందని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని.. అధికారం ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని.. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఖాయామని భీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేదని సొంత పార్టీ సర్వేల్లో తేలిపోవడం వలన ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం చేస్తుందని ఆయన విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ప్రజలు గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపుతారని ఆయన స్పష్టం చేశారు.
రైతులకు తప్పని తిప్పలు.. మళ్లీ యూరియా కోసం కష్టాలు
RTC Special Bus | అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేక బస్సులు
Leopard | వడ్డేపల్లిలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు