BRS Leaders | మర్కూక్, జూన్ 11 : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.. కేసీఆర్‌ను 50 నిమిషాలపాటు విచారించారు. కమిషన్‌కు కేసీఆర్ నివేదిక ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కూడా కమిషన్‌కు కేసీఆర్ అందజేశారు.
కాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ విచారణ నేపథ్యంలో కేసీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు మర్కూక్ మండలం ఎర్రవల్లి ఫాంహౌజ్ వద్దకు బుధవారం ఉదయం ఆయా మండలాల నుండి చేరుకొని ప్లకార్డులను ప్రదర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వినూత్నంగా ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ కన్ను, మేడిగడ్డపై రేవంత్ కుట్రలు, తెలంగాణ బతుకుచిత్రం కాళేశ్వరం లాంటి అక్షరాలతో కూడిన ప్లకార్డుల ప్రదర్శనతోపాటు వద్దురా నాయనా…కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేసీఆర్ కాన్వాయ్‌ని అనుసరిస్తూ హైదరాబాద్‌కు తరలివెళ్లారు.
‘అశుద్ధ’ జలం..! గాగిళ్లాపూర్‌లో కలుషితమవుతున్న తాగునీరు
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు