Collector Manu Chaudhary | రాయపోల్, ఏప్రిల్ 30 : రైతులకు ఎదురయ్యే భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకు వచ్చిందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ మను చౌదరి అన్నారు. కార్యాలయానికి రైతులు వస్తే అధికారులు ఓపికతో సమాధానం చెప్పాలని అన్నారు. ఇవాళ దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాయపోల్ మండలం ఆరేపల్లి రైతు వేదికలో భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు భూభారతి చట్టంలో చక్కటి పరిష్కారం జరుగుతుందని, చట్టంపై గ్రామాల్లో రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. కొన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి ఇప్పుడు కబ్జాలో ఉన్న భూములు వారి పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఈ చట్టంలో ఉందన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్రప్రభుత్వం గ్రామ పాలన పదివేల పోస్టులు నియమిస్తుందన్నారు.
అనర్హుల చేతికి వెళ్తే..
భూభారతి చట్టం చేసేటప్పుడు కమిషన్ సలహాలు, సూచనలు అడిగితే ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో ఎస్సీ, ఎస్టీ ప్రజలు చాలామంది కబ్జాలో ఉన్నారు. కానీ వారి పేరు మీద పట్టాలేక రైతు భరోసా పడక నష్టపోతున్నారని వారికి పట్టాలు అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూమిపై హక్కులు కలిగినా మోకా మీద లేకుండా కొంతమంది అమ్ముకున్న 1977 యాక్ట్ ప్రకారం అసైన్డ్ భూములు అమ్మడానికి వీల్లేదని రెగ్యులరైజేషన్ చేసే ఆప్షన్ ఉందని అనర్హుల చేతికి వెళ్తే వారి నుండి ప్రభుత్వం భూమి తీసుకొని అర్హులైన వారికి అందిస్తుందన్నారు.
ప్రభుత్వ భూములు, ఎండోమెంట్, ఇతరత్రా భూములు ఎవరైనా కబ్జా చేసి ఉంటే వారికి నోటీస్ ఇచ్చి వెరిఫై చేసి నిజ నిర్ధారణ జరిపి నిర్ణీత కాలవ్యవధిలో ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. సర్వేనెంబర్ రీ సర్వే చేయడానికి సర్వే నెంబర్లో ఉన్న భూ యజమానులను అందర్నీ పిలిపించి ఆమోదం తెలిపి రీ సర్వే నంబర్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 8 వేల సర్వే, పదివేల గ్రామస్థాయిలో పోస్టులు భర్తీ చేసి అందరికీ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు పారదర్శకంగా జిల్లాస్థాయిలో అన్ని సమస్యలను పరిష్కారం జరగాలని ఈ చట్టం ప్రవేశపెట్టారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ లింగమూర్తి, తహసీల్దార్లు చంద్రశేఖర రావు, శ్రీనివాస్, ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Mark Carney | ‘కార్నీ’వాల్.. టైమ్ టు విన్ పాటకు స్టెప్పులేసిన కెనడా ప్రధాని.. VIDEO
Dr. Haripriya | వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లాలి : డాక్టర్ హరిప్రియ
CITU | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం