Collector Manu Choudary | నారాయణరావుపేట, ఏప్రిల్ 19 : భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన భూ భారతి చట్టం రూపకల్పన చేసిందని జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. ఇవాళ నారాయణరావుపేట మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ఏప్రిల్ 14వ తేదీన అమల్లోకి వచ్చిందన్నారు. ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ చట్టం ప్రకారం ఏ సమస్యను ఎవరు ఎన్ని రోజుల్లో పరిష్కరించాలని, ఒకవేళ పరిష్కారం కాకుంటే ఎలా అప్పీల్‌కు వెళ్లాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపారు.
సీసీఎల్ఏకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్‌కు అధికారులను అప్పగించడం జరిగిందన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూధార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ లక్ష్మణరావు, అధికారులు పాల్గొన్నారు.
Inter Results | ఈనెల 22న ఇంటర్ ఫలితాలు..
Dilip Ghosh | 60 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిన బీజేపీ నేత.. ఫొటోలు వైరల్