Dilip Ghosh | భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేత (BJP leader) 60 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కారు. అదే పార్టీకి చెందిన మహిళను మనువాడారు. వీరి వివాహానికి పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా వేదికైంది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత దిలీప్ ఘోష్ (Dilip Ghosh) వయసు ప్రస్తుతం 60 ఏళ్లు. అయితే ఇప్పటి వరకూ ఆయన పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగానే ఉన్నారు. అదే పార్టీకి చెందిన 51 ఏళ్ల రింకూ మజుందార్ (Rinku Majumdar)తో దిలీప్‌కు 2021లో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో వరు శుక్రవారం కోల్‌కతా (Kolkata)లోని దిలీప్ నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం దిలీప్ ఘోష్ మీడియాతో మాట్లాడారు. తన తల్లి కోరిక మేరకు వివాహం చేసుకున్నట్లు చెప్పారు. ఇక దిలీప్‌కు ఇది మొదటి వివాహం కాగా, రింకూ మజుందార్‌కు ఇది రెండో వివాహం. ఆమెకు ఇప్పటికే ఓ కుమారుడు కూడా ఉన్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు, పలువురు నేతలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
“Just married” – Dilip Ghosh & Rinku Majumdar!
Many congratulations to the newly weds. @DilipGhoshBJP pic.twitter.com/m9Qe5T1aFn
— Pooja Mehta (@pooja_news) April 18, 2025
बधाई दिलीप दा 🙏♥️😊#DilipGhosh pic.twitter.com/dibf9xLTyF
— Yash Binani (मोदी का परिवार) (@YashBinani93) April 18, 2025
Also Read..
Kedarnath Dham | మే 2న కేదార్నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్ : టెంపుల్ కమిటీ
Cheetahs | ఆఫ్రికా దేశం నుంచి భారత్‌కు మరో 8 చీతాలు