Cheetahs | దేశంలో అంతరించిపోయిన చీతాల (Cheetahs ) పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆఫ్రికా నుంచి విడతల వారీగా చీతాలను భారత్కు తీసుకొస్తున్నారు. గతంలో దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి విడతల వారీగా చీతాలను భారత్కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 8 చీతాలు రానున్నాయి.
దక్షిణ ఆఫ్రికాలోని బోట్స్వానా (Botswana ) నుంచి రెండు విడతల్లో చీతాలను భారత్కు తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ పులుల సంరక్షణ అథారిటీ సమాచారం ఇచ్చింది. తొలి విడతలో భాగంగా మేలో 4 చీతాలను తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత మరో నాలుగు చిరుతలను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. దేశంలో చిరుత ప్రాజెక్ట్ కోసం ఇప్పటివరకు రూ.112 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. అందులో 67 శాతం మధ్యప్రదేశ్లో చిరుత పునరావాసానికి వెళ్లిందని వెల్లడించారు.
కాగా, ప్రాజెక్ట్ చీతాలో భాగంగా కేంద్రం 2022, సెప్టెంబర్ 17న నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారత్కు తీసుకొచ్చింది. అందులో ఐదు ఆడ చీతాలు, మూడు మగ చీతాలు ఉన్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలు వచ్చాయి. వీటన్నింటినీ మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో వదిలారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పలు చిరుతలు మృతి చెందాయి. ప్రస్తుతం కూనో పార్క్లో 26 చిరుతలు ఉన్నాయి. వాటిలో 14 భారత్లో జన్మించిన కూన పిల్లలు.
దేశంలో 71 ఏండ్ల క్రితం అంతరించి పోయిన చీతాలను ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరిస్తున్నది. ఇందులో భాగంగా ఆఫ్రికా దేశాల నుంచి విడుతల వారీగా దిగుమతి చేసుకుంటున్నది. కాగా, ప్రపంచంలోని 7 వేల చిరుతల్లో అధికంగా దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానాలో నివసిస్తున్నాయి. అయితే నమీబియాలోనే చీతాలు అత్యధికంగా ఉన్నాయి.
Also Read..
Arvind Kejriwal | కుమార్తె వివాహం.. భార్యతో కలిసి పుష్ప పాటకు డ్యాన్స్ చేసిన కేజ్రీవాల్.. VIDEO
Indian Student Dead | కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థిని మృతి
Gold Imports | ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి.. భారత్లో భారీగా పెరుగుతున్న పసిడి దిగుమతులు..!