Indian Student Dead | కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థిని మృతి
Indian Student Dead | కెనడాలో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థిని మృతి చెందింది. వర్క్ కోసం వెళ్లేందుకు బస్టాప్‌లో నిలబడి ఉన్న సమయంలో కాల్పులు జరిగాయి. అయితే, ఇద్దరు కారు డ్రైవర్లు ఒకరిపై ఒకరు కాల్పులు జరిపారని.. తూటాలు భారతీయ విద్యార్థినికి తగలడంతో మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
Indian Student Dead | కెనడాలో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థిని మృతి చెందింది. వర్క్ కోసం వెళ్లేందుకు బస్టాప్‌లో నిలబడి ఉన్న సమయంలో కాల్పులు జరిగాయి. అయితే, ఇద్దరు కారు డ్రైవర్లు ఒకరిపై ఒకరు కాల్పులు జరిపారని.. తూటాలు భారతీయ విద్యార్థినికి తగలడంతో మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతురాలు కెనడాలోని ఒంటారియోలోని హామిల్టన్‌లోని మోహాక్ కళాశాల విద్యార్థిని అయిన హర్సిమ్రత్ రంధావాగా గుర్తించారు. హర్సిమ్రత్ మృతిపై భారత కాన్సులేట్ జనరల్ సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాన్ని సంప్రదిస్తున్నామని.. అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. మృతురాలి కుటుంబానికి సంతాపం ప్రకటించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన హామిల్టన్‌లోని అప్పర్ జేమ్స్ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లుగా రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి విద్యార్థిని ఛాతి భాగంలో గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించా.. తుదిశ్వాస విడిచింది. నల్లటి కారులో ఉన్న వ్యక్తులు తెల్లటి కారుపై కాల్పులు జరిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కాల్పుల దుండగులు పారిపోయారని.. సమీపంలోని ఇంటి కిటికీ గుండా ఓ బుల్లెట్ దూసుకెళ్లిందని..ఆ ఇంట్లోని వ్యక్తులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా పోలీసులు వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

