Arvind Kejriwal | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కూతురు హర్షిత వివాహం (Kejriwal Daughter Marriage) శుక్రవారం రాత్రి ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ఘనంగా జరిగింది. హర్షిత తన స్నేహితుడు సంభవ్ జైన్‌ను కుటుంబ సభ్యుల సమక్షంలో మనువాడింది. అంతకు ముందు గురువారం రాత్రి వీరి ఎంగేజ్మెంట్ సెరిమొనీని కూడా నిర్వహించారు.
VIDEO | Visuals of Arvind Kejriwal (@ArvindKejriwal), AAP convenor and former Delhi CM, dancing with his wife, Sunita Kejriwal, at their daughter’s engagement ceremony in Delhi on Thursday.
(Source: Third party)
(Full video on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/oBWXYiExMg
— Press Trust of India (@PTI_News) April 18, 2025
ఈ వేడుకు సందర్భంగా కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. ముఖ్యంగా కేజ్రీవాల్ తన భార్య సునీత (Sunita Kejriwal)తో కలిసి డ్యాన్స్ చేయడం విశేషం. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ చిత్రంలోని ‘సూసేకీ’ పాట హిందీ వెర్షన్‌కు కేజ్రీవాల్ దంపతులు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక వివాహ వేడుకకు కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ నేత మనీశ్ సిసోడియాలు తదితరులు హాజరయ్యారు. వేడుకలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు.
Punjab CM Bhagwant Mann performing at the engagement ceremony of Kejriwal’s daughter in Delhi.#Bhagwantmann #ArvindKejriwal pic.twitter.com/Vy9PqA4Teu
— Raajeev Chopra (@Raajeev_Chopra) April 18, 2025
आज आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक श्री @ArvindKejriwal जी @KejriwalSunita जी की बिटिया हर्षिता का विवाह संपन्न हुआ। मैं भगवान से वर-वधु के लिए सुखद और सफल जीवन की कामना कर्ता हूं। @BhagwantMann Dr @gurdeepkaur maan भी शामिल हुए pic.twitter.com/vko2Z3DQhq
— भ्रष्टाचार मुक्त भारत (@DevenSaluja) April 18, 2025
Also Read..
Indian Student Dead | కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థిని మృతి
Gold Imports | ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి.. భారత్‌లో భారీగా పెరుగుతున్న పసిడి దిగుమతులు..!