Kedarnath Dham | జ్యోతిర్లింగ (Jyothirlingam) క్షేత్రమైన కేదార్నాథ్ (Kedarnath) ఆలయాన్ని మే2వ తేదీన ఓపెన్ చేయనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్ – కేదార్నాథ్ ఆలయ కమిటీ (Badrinath-Kedarnath Temple Committee) వెల్లడించింది. చార్ధామ్ యాత్ర (Char Dham Yatra)లో భాగంగా కేదార్నాథ్ ఆలయ ద్వారాలను మే 2 ఉదయం తెరవనున్నట్లు వెల్లడించారు. ఇక బద్రీనాథ్ (Badrinath) ఆలయాన్ని మే 4 నుంచి భక్తుల కోసం తెరవనున్నట్లు వెల్లడించారు.
పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలు కూడా ఉన్నాయి. చార్ధామ్ యాత్రలో ఈ దేవాలయాలు సందర్శన భాగంగా ఉంటాయి. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించి పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాలను మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయాలు మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటాయి. తిరిగి వేసవిలో ఈ ఆలయాల తలుపులు తెరుస్తారు. ఇక చార్ధామ్ యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుంది. భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను సందర్శిస్తారు. ఈ యాత్ర నేపథ్యంలో గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఈ నెల 30 నుంచి తెరవనున్నారు.
Also Read..
Cheetahs | ఆఫ్రికా దేశం నుంచి భారత్కు మరో 8 చీతాలు
Arvind Kejriwal | కుమార్తె వివాహం.. భార్యతో కలిసి పుష్ప పాటకు డ్యాన్స్ చేసిన కేజ్రీవాల్.. VIDEO
Indian Student Dead | కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థిని మృతి