Asha Workers | తొగుట, మార్చి24 : ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఇవాళ సీఐటీయూ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లోని వైద్య ఆరోగ్యశాఖ కమిషనరేట్ వద్ద జరిగే ధర్నాకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుండా అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. తమ న్యాయమైన డిమాండ్ పిక్స్డ్ వేతనం రూ.18 వేలు అందిం చాలని అన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆశాలను అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ శారద, వడ్డే వినోద, కే యాదమ్మ, జే పద్మ, పుష్పలత, జె భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.