శామీర్‌పేట, మార్చి 24 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీనోమ్ వ్యాలీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిని ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తుర్కపల్లికి చెందిన షాదుల్లా (27) రాపిడో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం బైక్‌పై కొల్తూర్ వైపు నుంచి ఇంటికి వెళ్తుండగా ఆర్కే ట్రావెల్స్‌కు చెందిన బస్సు (TS08UJ6299) అతి వేగంతో వచ్చి ఢీకొట్టింది. భారత్ బయోటిక్ ముందు జరిగిన ఈ ప్రమాదంలో షాదుల్లా తలకు బలంగా గాయాలవ్వడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న జీనోమ్ వ్యాలీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.