చెన్నై: కాలేజీ హాస్టల్లో ఒక సీనియర్ స్టూడెంట్ను జూనియర్లు కొట్టారు. అతడ్ని భౌతికంగా హింసించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో 13 మంది జూనియర్ స్టూడెంట్స్‌ను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. (Students Suspended) తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 20న నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో దొంగతనం ఆరోపణలపై సీనియర్ విద్యార్థిపై జూనియర్లు దాడి చేశారు. అతడ్ని కొట్టడంతోపాటు పలు రకాలుగా పనిష్మెంట్ ఇచ్చారు. అర్ధ నగ్నంగా మోకాళ్లపై ఉన్న ఆ స్టూడెంట్ బాధతో అల్లాడిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌కు దీనిపై ఫిర్యాదు అందింది. దీంతో దర్యాప్తు కోసం విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సీనియర్ స్టూడెంట్‌పై దాడికి పాల్పడిన 13 మంది జూనియర్ విద్యార్థులను గుర్తించారు. వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థులపై చర్యలు చేపడతామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
A disturbing incident at the Nehru Institute of Technology in Coimbatore has gone viral, sparking outrage. A group of first-year students allegedly assaulted a senior PG student inside the college hostel, accusing him of stealing money. The brutal assault lasted for hours, during… pic.twitter.com/0jI6eomKDX
— News9 (@News9Tweets) March 23, 2025