ACB Raids | గజ్వేల్/ మర్కూక్, ఏప్రిల్ 26 : గజ్వేల్‌లోని ఈఎన్సీ ఇరిగేషన్ కార్యాలయంలో ఇవాళ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మెదక్ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలోని ఉన్నతాధికారుల స్టేట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు.
అక్కడి నుండి మర్కూక్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ డీఎస్పీ సుదర్శన్, ఇన్స్పెక్టర్లు రమేష్, వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. సాయంత్రం వరకు చేపట్టిన తనిఖీల్లో రెవెన్యూ అధికారులతో మాట్లాడి పలు కీలక వివరాలు తెలుసుకోవడంతోపాటు రికార్డులను పరిశీలించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఈఎన్సీ హరిరామ్‌పై వచ్చిన అభియోగాలతో ఏసీబీ అధికారులు గజ్వేల్ ఈఎన్సీ కార్యాలయంతోపాటు మర్కూక్ తహసీల్దార్ కార్యాలయాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించి డాక్యుమెంట్స్‌ను పరిశీలించారు.
Palvancha : కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటున్న తెలంగాణ సమాజం : మాజీ మంత్రి వనమా
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్‌పేటలో ముందే మురిసిన గులాబీ జెండా