Suicide | సిర్గాపూర్, అక్టోబర్ 04: ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిర్గాపూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిర్గాపూర్ మండలంలోని పోచపూర్ గ్రామానికి చెందిన తడబోయిన శివకుమార్ (34) శనివారం ఉదయం ఇంటి నుంచి బైక్‌పై రోజువారీగా ఖేడ్‌లో టైలర్ వర్క్ కోసం బయలుదేరి వెళ్లాడు. అయితే మార్గమధ్యలో నల్లవాగు పరిసరాల్లో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అటుగా వెళుతున్న కొందరు ఈ విషయాన్ని గమనించి సిర్గాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిర్గాపూర్ పోలీసులు మృతుడిని పోచాపూర్కు చెందిన శివ కుమార్‌గా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివకుమార్ ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYDRAA | రేవంత్ రెడ్డి పక్కా దొంగనే.. నిప్పులు చెరిగిన హైడ్రా బాధితురాలు
Man Shoots Friend | ఫ్రెండ్‌ను కాల్చి చంపిన వ్యక్తి.. రికార్డ్ చేసిన వీడియో వైరల్