HYDRAA | హైదరాబాద్ : హైదరాబాద్ వాసులకు హైడ్రా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. అర్ధరాత్రి వేళ బస్తీలపై హైడ్రా బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. నిరుపేదల గుడిసెలను, రేకుల ఇండ్లను నేలమట్టం చేస్తూ.. వారి కడుపును కొడుతున్నారు హైడ్రా అధికారులు. మొన్న బతుకమ్మ పండుగ మొదటి రోజే గాజుల రామారంలో కూల్చివేతలు చేపట్టి పేదలకు నిలువ నీడ లేకుండా చేసిన హైడ్రా సిబ్బంది.. నేడు దసరా పండుగ తెల్లారే కొండాపూర్లో నిరుపేదలకు చెందిన పలు నిర్మాణాలను తొలగించారు.
కొండాపూర్లోని బిక్షపతి నగర్లో ఉన్న ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. శనివారం తెల్లవారుజామునే బుల్డోజర్లు, ప్రొక్రైనర్లతో వచ్చిన అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు.
ఈ సందర్భంగా బాధిత మహిళలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా అధికారులపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి దొంగ కాబట్టే చీకట్ల వచ్చి ఇండ్లు కూలగొట్టిండు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ ఇచ్చిన భూములు కాంగ్రెస్ ప్రభుత్వమే లాక్కుంటుంది. రేవంత్ రెడ్డి పక్కా దొంగ కాబట్టే.. తెల్లవారుజామున 4 గంటలకు మా ఇండ్లపైకి హైడ్రా బుల్డోజర్లను పంపించాడని ధ్వజమెత్తారు.
చివరకు రేవంత్ రెడ్డి మెడలో చెప్పుల దండలు వేస్తాము అని మహిళలు మండిపడ్డారు. ఈ భూమి అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే ఇందిరా గాంధీ ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాక్కుంటున్నాడు అని మహిళలు కన్నీరు పెట్టుకున్నారు.
రేవంత్ రెడ్డి దొంగ కాబట్టే చీకట్ల వచ్చి ఇండ్లు కూలగొట్టిండు
ఇందిరా గాంధీ ఇచ్చిన భూములు కాంగ్రెస్ ప్రభుత్వమే లాక్కుంటుంది
రేవంత్ రెడ్డి మెడలో చెప్పుల దండలు వేస్తాము
కొండాపూర్లో హైడ్రా కూల్చివేతల్లో బాధితుల ఆవేదన pic.twitter.com/KcG9ONeFXk
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2025