Mana Shankara Varaprasad Garu | మన శంకరవరప్రసాద్ గారు టీం క్రేజీ న్యూస్.. చిరంజీవితో పోటీకి సై అంటున్న దసరా విలన్
Mana Shankara Varaprasad Garu | చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న మన శంకర వర ప్రసాద్‌గారు (Mana Shankara Varaprasad) నుంచి దసరా కానుకగా మీసాల పిల్ల సాంగ్ ప్రోమోను లాంచ్ చేయగా అభిమానుల్లో జోష్ నింపేలా సాగుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది.
Mana Shankara Varaprasad Garu | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్‌గారు (Mana Shankara Varaprasad). ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ఇప్పటికే నెట్టింట రౌండప్ చేస్తోంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల (సంక్రాంతికి వస్తున్నాం ఫేం బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
దసరా కానుకగా మీసాల పిల్ల సాంగ్ ప్రోమోను లాంచ్ చేయగా అభిమానుల్లో జోష్ నింపేలా సాగుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ మూవీలో దసరా ఫేం షైన్ టామ్ చాకో కీ రోల్ చేస్తున్నాడట. తాజా సమాచారం ప్రకారం ఈ మలయాళ స్టార్ యాక్టర్ ఇందులో మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అయితే అనిల్ రావిపూడి ఈ సారి దసరా విలన్ పాత్రకు కామిక్ టచ్ జోడించబోతున్నాడని ఫిలింనగర్ సర్కిల్లో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.
ఈ క్రేజీ యాక్టర్ టీంలోకి జాయిన్ అయిన విషయాన్ని అనిల్ రావిపూడి టీం అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. షైన్ టామ్ చాకో దసరా, దేవర, డాకు మహరాజ్ చిత్రాలతో తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా.. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also :
Kalki 2 | సాయిపల్లవితో నాగ్ అశ్విన్ చర్చలు.. ఇంతకీ ప్రభాస్ కల్కి 2 కోసమేనా..?
Aaryan Movie | నితిన్ చేతికి విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సినిమా రైట్స్
The Raaja Saab | ప్రభాస్ ‘ది రాజాసాబ్’ డబ్బింగ్ షురూ.!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

