Prabhas – Raaja Saab | ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్ (Raaja Saab). మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 09న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి డబ్బింగ్ పనులు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఈ విషయాన్ని చిత్రబృందం ఎక్స్ వేదికగా ప్రకటించింది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. సప్తగిరి వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీనుతో పాటు బొమ్మన్ ఇరానీ తదితరులు ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
The world will soon hear the rage, romance and entertaining ride of #TheRajaSaab 🎙️🔥
Dubbing begins with all heart ❤️🔥#TheRajaSaabTrailer
▶️ https://t.co/2hObgSkeNH#TheRajaSaabOnJan9th #Prabhas pic.twitter.com/N3EraCqke1— The RajaSaab (@rajasaabmovie) October 3, 2025