హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల ఆందోళనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యాజమాన్యం దిగివచ్చిం ది. వర్సిటీలో రెండు రోజులుగా పీజీ, పీహెచ్డీ విద్యార్థులు తమకు పెంచిన ైస్టెపెండ్ను ఆగస్టు నెల నుంచి అమలు చేయాలని నిరవధిక దీక్షకు దిగారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో శుక్రవారం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య సమస్యను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దృష్టికి తీసుకెళ్లారు. పీజీ విద్యార్థుల ైస్టెపెండ్ నెలకు రూ. 12వేలు, పీహెచ్డీ విద్యార్థులకు రూ.15వేలు వర్సిటీ పాలక మండలి ఆమోదించిందని మంత్రికి వివరించారు. ఉపకులపతి ఇచ్చిన హామీతో విద్యార్థులు నిరవధిక దీక్షను విరమించారు. దీంతో వీసీ విద్యార్థులకు మజ్జిగ అందించి దీక్ష విరమింపజేశారు.