జూరాలకు తగ్గుతున్న వరద
జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం ప ట్టింది. మధ్యాహ్నం వరకు 29గేట్లు ఎత్తి దిగువకు 1,93,430 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సాయంత్రం వరద తగ్గుముఖం పట్టడంతో 21గేట్లు ఎత్తి దిగువకు 1,38,495 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
- 21గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
- ఇన్‌ఫ్లో 1,73,000, అవుట్ ఫ్లో 1,71,735 క్యూసెక్కులు
గద్వాల, ఆగస్టు 8 : జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం ప ట్టింది. మధ్యాహ్నం వరకు 29గేట్లు ఎత్తి దిగువకు 1,93,430 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సాయంత్రం వరద తగ్గుముఖం పట్టడంతో 21గేట్లు ఎత్తి దిగువకు 1,38,495 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శనివారం జూరాలకు ఎగువ నుంచి 1,73,000క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా విద్యుదుత్పత్తికి 29,525 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నా రు.
జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.31 మీటర్లు ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.297 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాలకు మొత్తం ఇన్‌ఫ్లో 1,73,000క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1,71,735 క్యూసెక్కులు ఉంది. ఎగువన ఉన్న అల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి వరద ఎక్కువగా వస్తే రాత్రికి జూరాల ప్రాజెక్టు మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యామ్ అధికారులు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

