Kalki 2 | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్ పోషించిన సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2024 జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
కాగా సిల్వర్ స్క్రీన్‌పై రికార్డు వర్షం కురిపించిన ఈ మూవీకి సీక్వెల్ కల్కి 2 కూడా రాబోతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే సీక్వెల్ పార్ట్‌లో దీపికాపదుకొనే ఉండటం లేదంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు రౌండప్ చేస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే తెలుగుతోపాటు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న కోలీవుడ్ భామ సాయిపల్లవి కల్కి 2లో కనిపించబోతుందట.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవితో చర్చలు జరిపినట్టు ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ముందుగా నాగ్ అశ్విన్ సాయిపల్లవితో ఓ ఫీ మేల్ ఓరియెంటెడ్ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయిపల్లవిని రీప్లేస్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. మరి నాగ్ అశ్విన్-సాయిపల్లవి కాంబోపై రానున్న రోజుల్లో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలనుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ఇంతకీ మరి నాగ్ అశ్విన్-సాయిపల్లవి కాంబినేషన్లో రాబోయేది ఫీ మేల్ ఓరియెంటెడ్ మూవీనా..? కల్కి 2 నా అనేది తెలియాల్సి ఉంది.
కల్కి 2898 ఏడీలో బాలీవుడ్ భామ దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.