Aaryan Movie | కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్యన్’. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకగా నటిస్తుండగా.. ప్రవీణ్ కె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. విష్ణు విశాల్ ఇందులో పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా తెలుగు హక్కులను టాలీవుడ్ నటుడు నితిన్ సొంతం చేసుకున్నాడు. నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ ఈ సినిమా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది.
The thrill spreads to other states too 💥#Aaryan – Andhra Pradesh and Telangana theatrical release by @SreshthMovies.
Coming to cinemas on the 31st of October 🔍@TheVishnuVishal @VVStudioz @adamworx @selvaraghavan @ShraddhaSrinath @Maanasa_chou @GhibranVaibodha @dop_harish… pic.twitter.com/2yZxYszkQg
— BA Raju’s Team (@baraju_SuperHit) October 4, 2025