సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మహిళ చెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కడుపునొప్పితో ఓ మహిళ అమీన్పూర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరింది. వైద్యలు శస్త్ర చికిత్స చేశాక చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని సదరు మహిళ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి చూడా చదవండి..
Pinarayi Vijayan | సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీయడమే!..డీలిమిటేషన్ బిల్లుపై విజయన్ ఆగ్రహం