Bengaluru | బెంగళూరు ఫైవ్ స్టార్ హోటళ్లలో తనిఖీలు.. కిచెన్‌లో కుళ్లిన కూరగాయలు, మాంసం
Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరులోని లగ్జరీ, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టగా దారుణ విషయాలు బయటపడ్డాయి. హోటళ్లలో కుళ్లిన కూరగాయలు, మాంసం, ఎక్స్పైరీ అయిన పాలు, ఫంగస్ సోకిన ఆహార పదార్థాలు లభ్యమయ్యాయి.
Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరులోని లగ్జరీ, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టగా దారుణ విషయాలు బయటపడ్డాయి. హోటళ్లలో కుళ్లిన కూరగాయలు, మాంసం, ఎక్స్పైరీ అయిన పాలు, ఫంగస్ సోకిన ఆహార పదార్థాలు లభ్యమయ్యాయి. పలు హోటళల్లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు ఏమీ పాటించట్లేదనే విషయం వెల్లడైంది. అనేక చోట్ల నిబంధనలు ఉల్లంఘించిన పరిస్థితులే ఉన్నాయి. కర్ణాటకకు చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన అధికారులు బెంగళూరు అర్బన్ జిల్లాలోని అనేక స్టార్ హోటళ్లలో తాజాగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి తనిఖీలు నిర్వహించారు.
30 టీంలు ఇందుకోసం పని చేస్తున్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి యూటీ ఖాదర్ కూడా వెల్లడించారు. తాజ్ యెశ్వంత్పూర్, షాంగ్రి లా బెంగళూరు వంటి ప్రముఖ త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. మొత్తం 26 హోటళ్లను తనిఖీ చేయగా, అనేక చోట్ల తీవ్రమైన ఉల్లంఘనలు కనిపించాయి. సాధారణంగా స్టార్ హెటల్స్ అనగానే.. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తారు అనుకుంటారు. కానీ, ఇక్కడ చాలా చోట్ల కనీస ప్రమాణాలు పాటించట్లేదని, పాడైన, ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన కూరగాయలు, మాంసం, పాలు, ఇతర తయారు చేసిన పదార్థాలనే వాడుతున్నట్లు తేలింది. ఈ హోటళ్ల నుంచి చికెన్, మటన్, చేపమాంసం, ఆయిల్, పాలు, మసాలాలు, టీ పౌడర్, చీజ్, సాసెస్ వంటి అనేక పదార్థాల శాంపిల్స్ సేకరించి, వాటిని పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపించారు. అనేక హోటళ్లలో కిచెన్‌లో పారిశుధ్యం లోపించినట్లు గుర్తించారు. అలాగే, కుళ్లిన కూరగాయల్ని వాడుతున్నారు. ఎప్పుడో తయారు చేసిన ఆహార పదార్థాలు పాడైనప్పటికీ వాటిని మళ్లీ వినియోగిస్తున్నారు. కొన్నింటికి ఫంగస్ సోకి ఉంది.
ఆహార పదార్థాల నిర్వహణ, భద్రత కూడా సరిగ్గా లేదు. కొన్ని పదార్థాలపై తప్పుడు లేబుల్స్ ఉన్నాయి. అలాగే, శాకాహార, మాంసాహారాన్ని ఒకే చోట కలిపి ఉంచారు. నిబంధనలకు ఇది విరుద్ధం. వెజ్, నాన్‌వెజ్ ఐటమ్స్ వేర్వేరుగా ఉంచాలి. లలిత్ అశోక్ హోటల్ నుంచి 76 కేజీల మాంసం, 200 కేజీల కూరగాయలు, 32 లీటర్ల పాలు పాడైనట్లు గుర్తించి, వాటిని నాశనం చేశారు. వివాంటా బెంగళూరు, షాంగ్రి లా బెంగళూరు, తాజ్ యెశ్వంత్పూర్ వంటి ప్రముఖ హోటళ్లలో కూడా కుళ్లిన మాంసం, కూరగాయలు, పాలు, బేకరి ఐటమ్స్ గుర్తించి ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఈ హోటళ్లు అన్నింటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

