Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో ‘గబ్బర్ సింగ్’ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించగా, రాశీ ఖన్నా కీలక పాత్రలో మెరిసింది. కోలీవుడ్ నటుడు పార్థీబన్ ప్రతినాయకుడిగా కనిపించారు. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ప్రారంభంలో మంచి హైప్ క్రియేట్ చేసుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. పవన్ కల్యాణ్ స్టైల్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అలాగే హరీశ్ శంకర్ మార్క్ డైలాగులు, హీరోయిన్ల గ్లామర్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. అయితే కథ, కంటెంట్ పరంగా సినిమా కొంత బలహీనంగా అనిపించిందని విమర్శలు వచ్చాయి.
ఇదే సమయంలో పోటీగా వచ్చిన ‘ధురంధర్ 2’ సినిమా కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్లపై ప్రభావం చూపింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లతోనే ముగిసింది. అయినప్పటికీ పవన్ అభిమానుల్లో మాత్రం సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుని, ఏప్రిల్ 15 అర్ధరాత్రి నుంచే ప్రసారం ప్రారంభించింది.
సంగీతం విషయానికి వస్తే, ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ పాటలు అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఎస్.ఎస్. థమన్ అందించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘తొలిప్రేమ’లోని ‘ఈ మనసే’ పాటను రీమిక్స్ చేయడం విశేషం. ఈ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. థియేటర్లలో యావరేజ్‌గా నిలిచిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పుడు ఓటీటీలో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.