PM Modi | నేనేమీ బాబా బాగేశ్వర్‌ను కాదు.. ఐఐటీ ఢిల్లీ విద్యార్థులను నవ్వించిన ప్రధాని
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఇవాళ ఢిల్లీ (Delhi) లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాబా బాగేశ్వర్ (ధీరేంద్ర కృష్ణ శాస్త్రి) పేరును ప్రస్తావించి సభలో నవ్వులు పూయించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
PM Modi : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఇవాళ ఢిల్లీ (Delhi) లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాబా బాగేశ్వర్ (ధీరేంద్ర కృష్ణ శాస్త్రి) పేరును ప్రస్తావించి సభలో నవ్వులు పూయించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వారి మనసులోని ఆలోచనలను సరదాగా ఊహించి చెప్పారు.
‘మీరంతా ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యారు. కానీ మీ మనసుల్లో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. నేనేం బాబా బాగేశ్వర్‌ను కాదు, కానీ మీ మదిలో ఏముందో ఊహించగలను. కొందరు భవిష్యత్తు గురించి, మరికొందరు జీతాల గురించి, ఇంకొందరు కొత్త నగరంలో కొత్త జీవితం గురించి, మరికొందరు స్టార్టప్‌ల గురించి ఆలోచిస్తుండవచ్చు’ అని మోదీ సరదాగా వ్యాఖ్యానించడంతో విద్యార్థులు, అధ్యాపకులు చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు.
ఈ వేడుకలో మూడు వేల మందికిపైగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు మీ కుటుంబసభ్యులు ఎంత గర్వపడుతున్నారో నేను కూడా మీ గురించి అంతే గర్విస్తున్నా. మీరు కేవలం డిగ్రీలు అందుకోవట్లేదు, దేశం కోసం ఏదైనా సాధించాలనే కలను ముందుకు తీసుకెళుతున్నారు’ అని విద్యార్థులను అభినందించారు. ప్రతి ఒక్కరి మార్గం, కలలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఐఐటీలో చేరిన మొదటి రోజు నుంచి ఈ స్నాతకోత్సవం వరకు సాగిన ప్రయాణం ప్రతి ఒక్కరిలో సంతృప్తిని నింపుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అకడమిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ప్రధాని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా స్పందిస్తూ.. ‘ప్రతిభావంతులైన విద్యార్థుల్లో కొంతమంది ఆడపిల్లలు ఉంటే బాగుండేది. క్షమించాలి కొందరు కాదు, చాలామంది ఉండాలి’ అని వ్యాఖ్యానించడంతో సభలో మరోసారి నవ్వులు విరిశాయి.
అనంతరం ఐఐటీ సోనిపట్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ‘పరం ప్రజ్ఞ’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై-పెర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సదుపాయం ఏఐ, డేటా సైన్స్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రంగాల్లో ఐఐటీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు క్యాంపస్ జీవితం, స్నేహితులు, గురువులు ఎప్పటికీ గుర్తుండిపోతారని మోదీ సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

