తిరువనంతపురం: కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీసి కేరళ వంటి రాష్ర్టాలపై ప్రతికూల ప్రభావం చూపగలదని పేర్కొన్నారు.
2011 జనగణన ఆధారంగా గురువారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టనున్న ప్రతిపాదిత బిల్లు రాష్ర్టాల హక్కులు, సమాన న్యాయంపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపగలదని ఆయన తెలిపారు. రాష్ర్టాలతో ఏకాభిప్రాయం సాధించకుండా కేంద్రం ఇంతటి కీలకమైన బిల్లును తీసుకురావడం ఆందోళన కలుగచేస్తున్నదన్నారు.