జహీరాబాద్, మే 4 : న్యాల్కల్ మండలం హుస్సేన్ నగర్ గ్రామంలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందినట్లు హద్నూర్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక గ్రామానికి చెందిన సిద్ధమ్మ (56) అనే మహిళ ఉదయం బాత్రూంకు వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు రేకులకు చేయి తగలడంతో షాక్ తగిలి కింద పడడంతో తలకు తీవ్ర గాయం అయింది.
వెంటనే చికిత్స నిమిత్తం బీదర్‌లోని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ దవాఖానలో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సిద్ధమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
IPL 2025 | వరుణ్, మోయిన్ స్పిన్ మాయాజాలం.. కుప్పకూలిన రాజస్థాన్ టాపార్డర్
Youtuber Anvesh | ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదు