Vaishnavi Chaitanya | బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఇండస్ట్రీలో బోణీ కొట్టిన అచ్చమైన హైదరాబాదీ బ్యూటీ వైష్ణవి చైతన్య. సినిమాల్లోకి రాకముందే డబ్స్మాష్ వీడియోలతో పాపులర్ అయిందామె. ‘బేబీ’తో ఒక్కసారిగా ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. ఇటీవల ‘జాక్’తో జతకట్టి ప్రేక్షకులను మరోసారి పలకరించింది. ఈ సందర్భంగా తన సినీ జర్నీ గురించి వైష్ణవి పంచుకున్న కబుర్లు..
నాకు భావోద్వేగాలు కూడిన పాత్రల్లో నటించాలని ఉంది. భిన్నమైన రోల్స్ చేసి అందరినీ మెప్పించాలనుకుంటున్నా. ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఇకముందు కూడా మంచి సినిమాలతో వాళ్లని ఎంటర్టైన్ చేస్తాను!
యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేశాను. వాటివల్ల సినిమాల్లోకి రాకముందే చాలామంది అభిమానులను సంపాదించుకోగలిగా. ‘సామజవరగమన’ కవర్ సాంగ్ చాలా పాపులర్ అయింది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో నా లైఫ్ అప్డేట్స్ షేర్ చేస్తాను. ఫ్యాన్స్ నుంచి వచ్చే మెసేజ్‌లకు సమయం దొరికినప్పుడు రిైప్లె ఇస్తాను. వాళ్ల అభిమానం నాకు చాలా ప్రత్యేకం.
నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టం. చిన్నప్పుడు అద్దం ముందు నిలబడి తెగ నటించేసేదాన్ని. మా అమ్మ నన్ను చూసి, ‘నీకు హీరోయిన్ అవ్వాలని ఉందా?’ అని అడిగేది. అవునని చెప్పేదాన్ని.
సమంత, పవన్ కళ్యాణ్ నాకు ఆదర్శం. ఎలాగైనా యాక్టర్ కావాలని డిసైడ్ అయ్యా. టిక్‌టాక్‌లో వీడియోలు చేయడం వల్ల చాలామంది నన్ను గుర్తించారు. సినిమాల్లోకి రావడానికి ఆ వీడియోలు ఎంతో ఉపయోగపడ్డాయి. మరోవైపు ఆడిషన్స్‌కు వెళ్తుండేదాన్ని. అక్కడ రిజెక్ట్ చేసినప్పుడు చాలా బాధయ్యేది. కానీ, సక్సెస్ అయ్యే వరకు ప్రయత్నాలు ఆపొద్దు అని డిసైడ్ అయ్యాను.
‘బేబీ’ నా కెరీర్లో టర్నింగ్ పాయింట్. ఈ సినిమా తర్వాత నాకు చాలా గుర్తింపు వచ్చింది, అభిమానుల ప్రేమ కూడా పెరిగింది. నా కలలు నిజమైన ఫీలింగ్ కలిగింది. డైరెక్టర్ సాయి రాజేష్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఆ పాత్రలోని ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవడానికి నేను చాలా వర్క్‌షాప్‌లకు హాజరయ్యాను. మొదటి రోజు షూటింగ్లో చాలా భయపడ్డా. కానీ, ఆనంద్ దేవరకొండ, విరాజ్ నన్ను ఎంకరేజ్ చేశారు.
కూచిపూడితోపాటు వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నా. మా ఫ్యామిలీకి అండగా నిలవడం కోసం ఈవెంట్స్‌లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని. అక్కడ వచ్చిన డబ్బు అమ్మకు ఇచ్చేసేదాన్ని. డ్యాన్స్ ఆర్థికంగా మాత్రమే కాదు, నా యాక్టింగ్కూ ఎంతో ఉపయోగపడింది. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
తమ్ముడు నితీష్, అమ్మ నాకు చాలా క్లోజ్. నాకు అండాదండా అన్నీ వాళ్లే. హైదరాబాదీ బిర్యానీ, ఐస్‌క్రీం అంటే చాలా ఇష్టం. ఖాళీగా ఉన్నప్పుడు నా పెట్ డాగ్ ఆల్ఫాతో ఆడుకుంటాను. సినిమాలు చూస్తాను. ‘బేబీ’ తర్వాత చాలా కథలు విన్నా. మంచి కథతో మళ్లీ మిమ్మల్ని ఆకట్టుకోబోతున్నా. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తా.