IPL 2025 : భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు మళ్లీ అదే తడబాటు కొనసాగిస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో 205 పరుగుల కొట్టేందుకు సిద్ధమైన ఆ జట్టును మోయిన్ అలీ(2-15), వరుణ్ చక్రవర్తి(2-15)లు వణికించారు. ధాటిగా ఆడుతున్న యశస్వీ జైస్వాల్(34)ను ఔట్ చేసిన అలీ కోల్‌కతాకు బిగ్ బ్రేకిచ్చాడు.
ఆ తర్వాత వరుణ్.. ఒకే ఓవర్లో ధ్రువ్ జురెల్(0), వనిందు హసరంగ(0)లను డకౌట్ చేసి రాజస్థాన్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. ప్రస్తుతం కెప్టెన్ రియాన్ పరాగ్(32 నాటౌట్), హెట్‌మైర్(3 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లకు స్కోర్ 75-5.
Through the gate ✖ 2️⃣ \|/
Varun Chakaravarthy is weaving his magic in Kolkata! 👏
Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @chakaravarthy29 | @KKRiders pic.twitter.com/vHcMTObTrL
— IndianPremierLeague (@IPL) May 4, 2025
ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(4)మరోసారి నిరాశపరిచాడు. వైభవ్ అరోరా బౌలింగ్‌లో టైమింగ్‌కు కుదరక.. అజింక్యా రహానే చేతికి చిక్కాడు. ఆ తర్వాత మోయిన్ అలీ(2-15), వరుణ్ చక్రవర్తి(2-11)లు తిప్పేయడంతో రాజస్థాన్ 71కే సగం వికెట్లు కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న యశస్వీ జైస్వాల్(34)ను ఔట్ చేసిన అలీ రెండో వికెట్ సాధించాడు. ఆ తర్వాత వరుణ్ తన వంతు అన్నట్టు ఒకే ఓవర్లో ధ్రువ్ జురెల్(0), హసరంగ(0)లను బౌల్డ్ చేసి రాజస్థాన్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడనుకో. కానీ, కెప్టెన్ రియాన్ పరాగ్(32 నాటౌట్) మాత్రం పట్టువిడవడం లేదు.