టేకులపల్లి, మార్చి 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని మంగళ్ తండా సమీపంలో గల చేనులో 25 కె.వి ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారు. గ్రామ సమీప చేనులో 25 కె.వి ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ ఫార్మర్ను పగులగొట్టి అందులోని కాపర్ వైర్‌ను చోరీ చేశారు. ఈ ఘటనపై టేకులపల్లి ఏఈ హాట్కర్ దేవా టేకులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాపర్ వైర్ దుండగులను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు. గడిచిన నెల రోజుల క్రితం సైతం మండలంలోని పెట్రాంచెలక సమీపంలో గల 25 కె.వి ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్ల వరుస చోరీలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు.